“దేవర” ట్రీట్ పైనే అందరి కళ్ళు..!

“దేవర” ట్రీట్ పైనే అందరి కళ్ళు..!

Published on May 19, 2024 8:00 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ ఆ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి గత కొన్ని రోజులు నుంచి సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఈ సినిమా హవానే కనిపిస్తుంది. అందుకు కారణం ఈ సినిమా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ అనే చెప్పాలి. ఎట్టకేలకి ఆ సాంగ్ రిలీజ్ డేట్ కి వచ్చేసాము.

ఇక అంతా ఈ సాంగ్ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సాంగ్ విన్న సినీ ప్రముఖులు ఆ సాంగ్ పై కావాల్సినంత హైప్ ని కూడా ఎక్కించారు. అలాగే వచ్చిన ప్రోమో, పోస్టర్ లు కూడా మరింత ఆసక్తి రేకెత్తించాయి. మెయిన్ గా సంగీత దర్శకుడు అనిరుద్ మ్యూజిక్ పైనే భారీ ఆసక్తి నెలకొంది. మరి చూడాలి ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది. ఇక ఈ సాంగ్ అయితే ఈరోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకి రిలీజ్ కానుంది. అలాగే అన్ని భాషల్లో ఒకటే కాకుండా ఒకో వెర్షన్ రానున్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు