“కల్కి” బుజ్జి ట్రీట్ పైనే అందరి కళ్ళు

“కల్కి” బుజ్జి ట్రీట్ పైనే అందరి కళ్ళు

Published on May 22, 2024 1:53 PM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని ఫీమేల్ లీడ్ లలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ వరల్డ్ క్లాస్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు కూడా నటిస్తుండగా రీసెంట్ గా ఈ సూపర్ స్టార్స్ తో సహా తమ నుంచి మరో సూపర్ స్టార్ ఉంది అంటూ ఓ ‘బుజ్జి’ రోబోట్ ని మేకర్స్ పరిచయం చేశారు.

మరి దీనిపై అందరిలో ఆసక్తి నెలకొనగా ఈ పర్టిక్యులర్ బుజ్జి కోసం ఏకంగా ఓ భారీ ఈవెంట్ నే ఇప్పుడు ప్లాన్ చేశారు. దీంతో ఈ అంశం కోసం ఇంత స్పెషల్ గా అది కూడా భారీ లెవెల్లో ఈవెంట్ ప్లాన్ చేయడం ఏంటి అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అందుకే అసలు ఈ ఈవెంట్ లో మేకర్స్ ఎలాంటి సర్ప్రైజ్ అందిస్తారు అనేది మరింత ఇంట్రెస్టింగా మారడంతో అందరి కళ్ళు ఈ ఈవెంట్ మీదనే ఉన్నాయి. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు