“కేరళ స్టోరీ” ఓటిటి వెర్షన్ పై నెలకొన్న ఆసక్తి!

“కేరళ స్టోరీ” ఓటిటి వెర్షన్ పై నెలకొన్న ఆసక్తి!

Published on Feb 12, 2024 11:11 PM IST

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన కేరళ స్టోరీ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న హిందీలో ZEE5లో డిజిటల్‌గా ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రం కి సంబందించిన అన్‌కట్ వెర్షన్‌ను రిలీజ్ చేస్తారా అనే దానిపై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం రీ సెన్సార్‌కు గురైనట్లు ఆన్‌లైన్‌లో పుకార్లు వస్తున్నాయి. అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అదా శర్మతో కలిసి యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ, దేవదర్శిని, మరియు విజయ్ కృష్ణ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. సన్‌షైన్ పిక్చర్స్‌పై విపుల్ అమృతలాల్ షా నిర్మించిన కేరళ స్టోరీకి విశాఖ్ జ్యోతి మరియు వీరేష్ శ్రీవల్స సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు