అందరి చూపు శ్రీహరి కొడుకు వైపే !

Published on May 30, 2019 3:26 pm IST

స్వయకృషితో ఎదిగి నటుడిగా ఉన్నత స్థానాలను చూశారు కీ.శే.శ్రీహరి. ఆయన ఎంతమంచి నటుడో వ్యక్తిగా అంతకంటే మంచివారని ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట. ఆయన మరణంతో పరిశ్రమ ఒక మంచి నటుడ్ని కోల్పోయిందని అంతా బాధపడ్డారు. ఆ లోటును తీర్చడానికి ఆయన పెద్ద కుమారుడు మేఘాంశ్ శ్రీహరి ‘రాజ్‌దూత్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

సినిమా ప్రీ లుక్ నిన్ననే విడుదలైంది. అందులో మేఘాంశ్ కనిపిస్తున్న తీరును చూసి ఈ కుర్రాడిలో స్టఫ్ ఉన్నట్టుంది అనుకుంటున్నారు అంతా. ఇండస్ట్రీలో సైతం మేఘాంశ్ మంచి హీరో అయ్యేందుకు కావాల్సిన లక్షణాలను కలిగి ఉన్నాడని చెప్పుకుంటున్నారు. మరి ఇంతలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్‌తో దిగుతున్న మేఘాంశ్ ఎలా ఉంటాడో చూడాలంటే ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఆగాలి. ఇకపోతే కార్తీక్ – అర్జున్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More