చరణ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్ ఉండకపోవచ్చట.!

Published on Mar 26, 2021 5:51 pm IST

మామూలుగా ఓ స్టార్ హీరో పై స్పెషల్ అకేషన్ వస్తుంది అంటే ఆల్ మోస్ట్ ఆ హీరో పైనే ఇండస్ట్రీ మోస్ట్ టాక్ నడుస్తుంది. మరి అలా ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హవా నడుస్తుంది. దీని ప్రకారం చరణ్ చేస్తున్న పలు చిత్రాల నుంచి ఆల్రెడీ పాన్ ఇండియన్ చిత్రం రౌద్రం రణం రుధిరం నుంచి అప్డేట్ కన్ఫర్మ్ అయ్యింది. కానీ మిగతా భారీ ప్రాజెక్ట్ లు నుంచి ఎలాంటి అప్డేట్ ఇంకా రాలేదు.

అయితే మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” అప్డేట్ పక్కన పెడితే లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ శంకర్ సినిమా నుంచి ఆల్ మోస్ట్ ఎలాంటి అప్డేట్ ఉండదనే తెలుస్తుంది. ప్రస్తుతమికి అయితే అంతా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నారట. సో ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండకపోవచ్చనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి అలాగే ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది అని ఊహాగానాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి ఈ ప్రాజెక్ట్ కు ఏమవుతుందో..

సంబంధిత సమాచారం :