బాలీవుడ్ స్టార్ హీరోతో “అపరిచితుడు” రీమేక్ కు ఆల్ సెట్.?

Published on Apr 10, 2021 7:06 am IST

మన ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ టాలెంటెడ్ అండ్ టాప్ మోస్ట్ దర్శకుల జాబితాలో కోలీవుడ్ దర్శకుడు శంకర్ పేరు తప్పనిసరిగా ఉంటుంది. తన టేకింగ్ మరియు ఇంటెలిజెన్స్ తో ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరు గాంచిన శంకర్ ఎన్నో అద్భుతమైన సబ్జెక్టులు అందించారు. మరి వాటిలో టాలెంటెడ్ హీరో చియాన్ విక్రమ్ తో తీసిన “అన్నియన్” తెలుగులో “అపరిచితుడు” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

ఇప్పటికీ కూడా రిపీటెడ్ గా ఈ చిత్రాన్ని చూసే వారు ఉన్నారు. అయితే మరి భారీ హిట్ అయ్యిన ఈ చిత్రం హిందీ రీమేక్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై రణ్వీర్ ఆల్రెడీ శంకర్ తో మాట్లాడుతున్నాడట. అలాగే హిందీలో ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.

కాకపోతే ఈ చిత్రం సెట్స్ మీదకు అప్పుడే కాకుండా వచ్చే ఏడాది నిదానంగా స్టార్ట్ కానున్నట్టు తెలుస్తుంది. అయితే రణ్వీర్ ప్రస్తుతం లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం “83” ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా, ఎన్టీఆర్ తీసిన పివర్ ప్యాకెడ్ చిత్రం “టెంపర్” రీమేక్ తో బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :