దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఆయనేనా ?

Published on Mar 3, 2021 1:51 am IST


తెలుగు తెరకు మ‌రో కొత్త హీరో ప‌రిచ‌యం కాబోతున్నాడు. ద‌గ్గుబాటి కుటుంభం నుంచి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, రానాలు తెలుగు తెర‌పై రాణిస్తుండ‌గా తాజాగా ద‌గ్గుబాటి సురేష్ రెండో కుమారుడు, రానా సోద‌రుడు అయిన అభిరామ్ తెలుగు ఇండ‌స్ట్రీలో మెరిసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి స‌న్నాహాలు కూడా ప్రారంభ‌మైనట్టు తెలుస్తోంది. అభిరామ్ ఇదివరకే ఎంట్రీ ఇవ్వాల్సింది. ‘రాజు మహారాజు’ ఫేమ్ భానుశంకర్ దర్శకత్వంలో అభిరామ్ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల అది చర్చలు దశలోనే ఆగిపోయింది.

మళ్ళీ ఇన్నాళ్లకు సరైన కథ దొరకడంతో సురేష్ బాబు చిన్న కొడుకుని హీరోగా లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు ఫిలిం నగర్ టాక్. రవిబాబు దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు రవిబాబు గతంలో ‘అల్లరి, అనసూయ, అమరావతి, అవును, నచ్చావులే’ లాంటి హిట్ సినిమాలను చేశారు. కథ, కంటెంట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఆయన. అందుకే ఆయన చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే సినిమా గురించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ బయటికొచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :