నేడే శ్రీమంతుడు స్పెషల్ ఆడియో రిలీజ్ పోస్టర్

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీమంతుడు’. ఈ సినిమా ఆడియో లాంచ్ జూలై 18న గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రొడక్షన్స్ టీం ఆడియో లాంచ్ కోసం అన్ని పనులను పూర్తి చేసింది. రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్ గా శ్రీమంతుడు ఆడియో లాంచ్ ని ప్లాన్ చేస్తున్నారు. శ్రీమంతుడు ఆడియో వేడుక కోసం శిల్పకళావేదికని ఫైనలైజ్ చేసిన సంగతి ఇది వరకే తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు శ్రీమంతుడు ఆడియో లాంచ్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకూ ఒకే ఒక్క పోస్టర్ ని రిలీజ్ చేసిన ఈ చిత్ర టీం ఈ పోస్టర్ తో మహేష్ బాబు మరో స్టిల్ ని రిలీజ్ చేయనున్నారు.

మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కుటుంబ విలువలతో పాటు మహేష్ అభిమానులు కోరుకునే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం. మహేష్ బాబు సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగుతున్న ఈ సినిమాని మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ చేయనున్నారు. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో మైత్రి మూవీస్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనం శెట్టి, అంగన రాయ్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version