ఈవారంలో విడుదలకానున్న ‘కొచ్చాడియాన్’

ఈవారంలో విడుదలకానున్న ‘కొచ్చాడియాన్’

Published on May 20, 2014 2:00 AM IST

kochadaiyaan-Poster
సూపర్ స్టార్ రజనికాంత్ ‘కొచ్చాడియాన్’ ఈ వారం లో విడుదల కానుంది. రజని కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన ఈ మోషన్ కాప్చుర్ అద్బుతం తెలుగు లో ‘విక్రమ సింహ’ పేరు తో విడుదల చేయనున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కొన్ని వ్యాపార కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఎరోస్ సంస్థ ఈ సినిమా వాణిజ్య వ్యవహారాల భాధ్యతలను తీసుకుంది మరియు ఈ చిత్రాన్ని సాజావుగా విడుదల చేయనుంది.

దీపిక పదుకొనె హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం లో రజని ద్విపాత్రాభినయం చేయనున్నారు.

తాజా వార్తలు