“సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?

“సలార్ 2” మిగతా షూట్ కి ఆల్ సెట్!?

Published on Apr 30, 2024 7:04 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ రెండో అతి పెద్ద గ్రాసర్ గా నిలిచి సెన్సేషన్ ని సెట్ చేసింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ “సలార్ శౌర్యంగపర్వం” ని మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదట్లో కాస్ట్ లేట్ గా స్టార్ట్ అవుతుంది అని టాక్ వచ్చింది.

కానీ కొన్ని పరిస్థితులు రీత్యా వెంటనే మొదలవుతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇప్పుడు తాజా కథనాలు ప్రకారం ఈ చిత్రం ఈ మే నెల నుంచే మొదలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనితో మరోసారి పాన్ ఇండియా వైడ్ సలార్ విధ్వంసానికి సమయం ఆసన్నం అయ్యింది అని చెప్పాలి. ఆల్రెడీ పార్ట్ 2 సంబంధించి కొంతమేర షూట్ మేకర్స్ కంప్లీట్ చేశారు. ఇక ఈ మిగతా త్వరలోనే పూర్తి చేసి రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు