భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతున్న 2.0 !

భారీ స్థాయిలో విడుదలకు సిద్దమవుతున్న 2.0 !

Published on Nov 8, 2018 7:50 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘2.0’చిత్రం విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు , తమిళ , హిందీ భాషల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

సూపర్ స్టార్ రజినీ నటించిన చిత్రం కావడంతో ఈ చిత్రం ఫై తమిళ ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. విజువల్ వండర్ గా రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు గాను ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ హక్కులను ఎన్వీఆర్ సినిమాస్ దక్కించుకుంది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు