జవవరి 3న ‘హల్ చల్’ గ్రాండ్ రిలీజ్..!

జవవరి 3న ‘హల్ చల్’ గ్రాండ్ రిలీజ్..!

Published on Jan 2, 2020 2:20 PM IST

halchal

రుద్రాక్ష్ , ధన్యా బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా ఎమ్.ఎస్.కె డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై గణేష్ కొల్లూరి నిర్మించిన హల్ చల్ జనవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంధర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు క్రాంతి మాధవ్, శివ నిర్వణ, నిర్మాతలు బెక్కం వేణు గోపాల్, మల్కాపురం శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ….”అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్ చల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవ్వడం సంతోషంగా ఉంది. నేను ఈ సినిమా చూశాను, బాగుంది. రేవు సినిమా విడుదల తరువాత ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. మంచి కంటెంట్ తో కూడుకున్న సినిమా ఇది. అందుకోసం నా వంతు సహాయం చేస్తున్నాను” అన్నారు.

హీరో రుద్రాక్ష్ మాట్లాడుతూ….”మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన క్రాంతి మాధవ్, శివ నిర్వణ గారికి థాంక్స్, మేము ఇష్టపడి ఈ సినిమా చేశాము. నన్ను నమ్మి ఈ సినిమా చేసిన నా నిర్మాతకు జీవితాంతం రుణపడి ఉంటాను. డైరెక్టర్ నాకు ఈ కథ చెప్పగానే నచ్చింది, చేశాను. సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది, రిలీజ్ డేట్ పై క్లారిటీ రావడం లేదు, అలాంటి సమయంలో శివకుమార్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. కొత్త కాన్సెప్ట్స్ ను అలరించే ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది. మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రేక్షకులకు ఈ సంధర్భంగా కోరుకుంటున్న” అన్నారు.

డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ…”రుద్రాక్ష్ నాకు మంచి ఫ్రెండ్, ఇండస్ట్రీలో ఉన్న తక్కువ ఫ్రెండ్స్ లో తాను ఒకడు, తాను ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాడు. ఈ సినిమా హిట్ అయ్యి చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నిర్మాత గణేష్ మాట్లాడుతూ….”హల్ చల్ మూవీని 3 ఏళ్ళ నుండి కష్టపడి తీశాము, ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి, అలాంటి సంధర్భంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ నాకు సపోర్ట్ చేశారు, ఆయనకు నా ప్రేత్యేక ధన్యవాదాలు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు. మా ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ…”శివకుమార్ గారు మా సినిమాకు చేస్తున్న సపోర్ట్ కు స్పెషల్ తెలుపుతున్నాను. హాల్ చల్ సినిమాలో మంచి రోల్ చేశాను, అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా ఆడియన్స్ దగ్గరకు రాబోతోంది. ఈ సినిమాను థియేటర్ లో చూడండి ప్లీజ్ పైరసీని ఎంకరేజ్ చేయొద్దని” తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు