వాళ్లకు మాత్రం ఎన్టీఆర్ నుండి ఈ ఏడాది రెండు సినిమాలు…!

Yamadonga 1

రాజమౌళి దర్శకత్వంలో 2007లో తెరకెక్కించిన యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది.సోషియో ఫాంటసీ ఇతివృత్తంతో భూలోకం, యమలోకంలో జరిగే కథతో రూపొందిన ఈ చిత్రం ఇప్పుడు తమిళంలో విజయన్‌ పేరుతో అనువాదమైంది. దీనికి అనువాద రచయితగా ఏఆర్‌కే.రాజా పనిచేశారు. దీన్ని తమిళంలో ఓం శ్రీసప్త కన్నియమ్మన్‌ పతాకంపై ఎం.జయకీర్తి, రేవతీ మేఘవన్నన్‌ అనువదించారు. కాగా అనువాద కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విజయన్‌ చిత్రాన్ని శ్రీ మనీశ్వర మూవీస్‌ సంస్థ విడుదల హక్కులను పొంది జనవరి 3న తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇక తెలుగులో ఎటువంటి సినిమా లేకుండానే ముగించిన తారక్ 2020 ప్రారంభంలోనే తమిళ ప్రేక్షకులను విజేయన్ చిత్రం తో పలకరిస్తున్నారు. 2020 జులై 30న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా దాదాపు పదిబాషలలో విడుదల కానున్న ఈ తమిళంలో కూడా విడుదల అవుతుంది. కాబట్టి ఎన్టీఆర్ నుండి ఈ ఏడాది తమిళ ప్రేక్షకుల కొరకు రెండు సినిమాలు రానున్నాయన్న మాట. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా.. మరో హీరో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు.

Exit mobile version