క్రేజీ సీక్వెల్ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Apr 5, 2021 8:00 am IST

డైరెక్టర్ సెల్వరాఘవన్ దర్శకత్వంలో 2010లో వచ్చిన భారీ సినిమా యాక్షన్‌ ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’. తెలుగులో ‘యుగానికి ఒక్కడు’గా విడుదలైంది. కార్తీ, రీమాసేన్, ఆండ్రియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. అందుకే పదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ చేయబోతున్నాడు సెల్వరాఘవన్. ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు కూడా.

ఇక ఈ సీక్వెల్‌ లో ధనుష్ హీరోగా చేయబోతున్నాడు. ప్రస్తుతం సెల్వరాఘవన్ స్క్రిప్ట్ ను పూర్తి చేశాడని.. ప్రస్తుతం గ్రాఫిక్స్ కి సంబంధించిన వర్క్ జరుగుతుందని.. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ను కూడా మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అన్నదమ్ముల కలయికలో దశాబ్దం తర్వాత సినిమా రానుండటంతో కోలీవుడ్ లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ లో నిర్మించబోయే ఈ సినిమాని 2024 లో విడుదలచేస్తారట.

సంబంధిత సమాచారం :