నేడే ‘శ్రీమంతుడు’ ఆడియో రిలీజ్..!

నేడే ‘శ్రీమంతుడు’ ఆడియో రిలీజ్..!

Published on Jul 18, 2015 9:31 AM IST

Srimanthudu-Audio-Release
మహేష్ అభిమానులు తమ అభిమాను హీరోను తెరపై చూసే సమయం దగ్గరపడుతోంది. ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా అభిమానులను అలరించడానికి మహేష్ ‘శ్రీమంతుడు’తో మన ముందుకు రానున్నారు. ఈలోపున అభిమానులకు ముందే పండగ వాతావరణం కల్పించేందుకు నేడు హైద్రాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో ఆవిష్కరణ వేడుక వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే!

మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక శిల్పకళావేదికలో నేడు జరగనున్న ఆడియో ఆవిష్కరణ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయ్! ఈ వేడుకలో ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నారు. సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్, మహేష్, శృతిహాసన్‌లతో పాటు మిగతా నటీనటులు పాల్గొనే ఈ వేడుకను వినూత్నంగా నిర్వహించేందుకు శ్రీమంతుడు టీమ్ ప్లాన్ చేసుకుంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా ఉండనుందని దర్శకుడు కొరటాల శివ మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. ఇక ఆడియో వేడుకకు సంబంధించిన విశేషాలు, ఫోటోలు, థియేట్రికల్ ట్రైలర్, ఆడియో జూక్‌బాక్స్ తదితర విషయాల కోసం 123తెలుగు.కాం చూస్తూనే ఉండండి.

తాజా వార్తలు