తమిళ స్టార్ హీరోల దండయాత్ర

Published on Feb 27, 2020 6:23 pm IST


తమిళ హీరోలు చాలామంది టాలీవుడ్ మార్కెట్ మీద గట్టిగానే కన్ను వేశారు. తమ ప్రతి చిత్రాన్ని తమిళంతో సమానంగా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఫలితంగా అక్కడి పెద్ద హీరోల చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో తరచూ వస్తూనే ఉన్నాయి. ఈ 2020లో అయితే అక్కడి స్టార్ హీరోలు వరుస సినిమాలతో తెలుగులో సందడి చేయనున్నారు.

ఇప్పటికే ‘దర్బార్’ చిత్రంతో సూపర్ స్టార్ రజనీకాంత్ ఖాతా ఓపెన్ చేయగా శివ డైరెక్షన్లో చేస్తున్న కొత్త చిత్రం ఈ దసరాకి రిలీజ్ కానుంది. అలాగే విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘మాస్టర్’ కూడా ఏప్రిల్ నెలలో రానుండగా మరొక స్టార్ హీరో అజిత్ నూతన చిత్రం ‘వాలిమై’ దీపావళి కానుకగా విడువిడుదలవుతుంది.

ఇక సూర్య, సుధా కొంగరల ‘సూరరై పొట్రు’ ఏప్రిల్ నెలలో, విక్రమ్ యొక్క భారీ బడ్జెట్ సినిమా ‘కొబ్రా’ మే చివరన, కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ధనుష్ చేస్తున్న ‘జగమే తంతిరమ్’, శింబు యొక్క ‘మానాడు’ ఈ యేడాదిలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ఈ అన్ని సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఏకకాలంలో విడుదలవుతాయి. మొత్తం మీద ఈ సంవత్సరం తెలుగు స్టార్ హీరోల సంగతి ఏమో కానీ తమిళ స్టార్ హీరోలు మాత్రం టాలీవుడ్ మీద దండయాత్ర చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More