ఊహించని వసూళ్లతో దూసుకుపోతున్న “అల్లావుద్దీన్”.

Published on May 28, 2019 11:34 am IST

అరబిక్ జానపద కథలు ఆధారంగా తెరకెక్కిన విజువల్ వండర్ “అల్లావుద్దీన్”. హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్, మేనా మసూద్, నవోమి స్కాట్ ప్రధాన పాత్రలలో నటించారు. గయ్ రిఛీ దర్శకత్వ సారథ్యంలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ”అల్లావుద్దీన్”మూవీ ని , విజువల్ వండర్ గా మే 24 న తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాలలో “అల్లావుద్దీన్” కి వస్తున్న ఆదరణ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. విడుదలైన మొదటి రోజు నుండి ఈ సినిమా వసూళ్లు స్టడీగా ఉన్నాయి. మొదటి రోజుతో పోలిస్తే వర్కింగ్ డే సోమవారం నాడు ఎక్కువ కలెక్షన్స్ రావడం ఈ సినిమా విజయానికి నిదర్శనం. మంచి వర్డ్ అఫ్ మౌత్ కలెక్షన్స్ పెరగడానికి ప్రధాన కారణం. ముఖ్యంగా ఇది చిన్న పిల్లల తో పాటు కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా కావడం, వేసవి శెలవులు కావడం ఈ సినిమాకు కలిసొచ్చే మరో అంశం.

సంబంధిత సమాచారం :

More