గుమ్మడికాయ కొట్టేసిన ‘బందిపోటు’..

bandipotu
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బందిపోటు’. మంగళవారం నాడు ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. సినిమా అవుట్ పుట్ పట్ల యూనిట్ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. నిర్మాణంతర కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి సంక్రాంతి తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నరేష్ సరసన ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్ ప్రత్యేక పాటలో నర్తించింది. అల్లరి నరేష్ ఘరానా దొంగగా ఈ సినిమాలో వినోదం పండించనున్నారు. నరేష్ గత సినిమాలకు భిన్నంగా ‘బందిపోటు’ తెరకెక్కిందని సమాచారం. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version