‘ఓజి 2’ కి బిగ్ ఛేంజ్?

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో తన వింటేజ్ సినిమాల సమయంలో ఏ రకమైన హైప్ ఉండేదో ఆ తరహా హైప్ లో వచ్చిన ఏకైక సినిమానే ఓజి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా మిక్స్డ్ టాక్ తో కూడా 300కోట్లు గ్రాస్ కి పైగా రాబట్టింది. అయితే ఈ సినిమా సీక్వెల్ ని పవన్ కూడా కన్ఫర్మ్ చేయడంతో ఈ సినిమా కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఇదిలా ఉండగా పార్ట్ 2 విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది. దీని ప్రకారం ఓజి పార్ట్ 1 నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ పార్ట్ 2 కి ఉండబోతోందని తెలుస్తోంది. పార్ట్ 2 కంప్లీట్ గా పవన్ ఇంకా టీజీ విశ్వ ప్రసాద్ ల కలయికలో నిర్మాణం పూర్తి అవుతుంది అని లేటెస్ట్ టాక్. సో ఇక సుజీత్ కి మరింత ఫ్రీ హ్యాండ్ వుంటుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా మొదలు కావడానికి అయితే మరికొంత సమయం పడుతుంది.

Exit mobile version