ఇంట్రెస్టింగ్.. ధురంధర్ 2 కంటే పార్ట్ 1 వసూళ్లే ఎక్కువ? ఇదెలా అంటే

ఒక సినిమా పెద్ద హిట్ అయ్యింది అంటే దానికి కొలమనంగా అది అందుకునే వసూళ్లతో పాటుగా థియేటర్స్ లో కొనసాగే రోజులుని కూడా చూసే చెప్పాలి. ఇప్పుడు దాదాపు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయిపోతే చాలు అని చాలామంది అనుకుంటున్నారు కానీ లాంగ్ రన్ లు మాత్రం చాలా తక్కువ సినిమాలే అందుకుంటున్నాయి.

అలా సెన్సేషనల్ లాంగ్ రన్ చూసిన ఇటీవల సినిమాల్లో బాలీవుడ్ సెన్సేషన్ ధురంధర్ కోసం చెప్పుకోవాలి. పార్ట్ 1 నెక్స్ట్ లెవెల్ లాంగ్ రన్ చూసింది. ఒక రకంగా చెప్పాలంటే పార్ట్ 2 కంటే పార్ట్ 1 లాంగ్ రన్ లో సెట్ చేసిన నంబర్లే అత్యధికం అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ గా ధురంధర్ 2 మూడో శనివారం వసూళ్లు తెలుస్తున్నాయి.

పార్ట్ 2 కి గాను మూడో శనివారం 12 కోట్లకి పైగా నెట్ వసూళ్లు రాబడితే పార్ట్ 1 కి మాత్రం 20 కోట్లకి పైగా వచ్చాయట. దీనితో పార్ట్ 1 ఏ రేంజ్ లో జనాదరణ పొందిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే పార్ట్ 2 ఈ రేంజ్ లో లాంగ్ రన్ నెంబర్స్ పెట్టకపోవడం అనేది ఒకింత ఆశ్చరకరమే అని చెప్పాలి.

Exit mobile version