కొత్త సినిమాకి మాస్, రఫ్ లుక్ లో అదరగొట్టేసిన అల్లరి నరేష్

కొత్త సినిమాకి మాస్, రఫ్ లుక్ లో అదరగొట్టేసిన అల్లరి నరేష్

Published on May 28, 2024 12:48 PM IST

టాలెంటెడ్ నటుడు అల్లరి నరేష్ నటించిన చిత్రాలు ఈ ఏడాదిలో రెండు ఆల్రెడీ వచ్చాయి. కింగ్ నాగ్ “నా సామిరంగ” లో సాలిడ్ సపోర్టింగ్ రోల్ ని తాను చేయగా నెక్స్ట్ “ఆ ఒక్కటీ అడక్కు” చిత్రంతో పలకరించాడు. అయితే నటుడుగా తనని తాను మరింత ప్రూవ్ చేసుకునేందుకు అల్లరి నరేష్ బాగా పరితపిస్తూ పలు సీరియస్ సబ్జెక్టు లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు తన నుంచి ఓ సాలిడ్ సినిమా అనౌన్స్ అయ్యింది.

“బచ్చల మల్లి” అంటూ అనౌన్స్ చేసిన ఈ చిత్రం నుంచి నరేష్ పై ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా మేకర్స్ రివీల్ చేయగా డెఫినెట్ గా ఈ రఫ్ లుక్ లో ఉన్నది అల్లరి నరేషేనా అని గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్నాడు. ఆ రేంజ్ లో తన మాస్ అండ్ రఫ్ గా కనిపిస్తున్నాడని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సుబ్బు మంగడెవ్వి దర్శకత్వం వహిస్తుండగా విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే రాజేష్ దండ, బాలాజీ గుట్ట లు హాస్య మూవీస్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు