‘దేవర’లో పాత్ర పై అల్లరి నరేష్ క్లారిటీ

‘దేవర’లో పాత్ర పై అల్లరి నరేష్ క్లారిటీ

Published on Apr 29, 2024 9:00 AM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఐతే, ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని వార్తలు వచ్చాయి. అల్లరి నరేష్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘దేవర’ సినిమా గురించి ప్రస్తావించారు. ‘‘దేవర’ సినిమాలో నేను ఏ పాత్రలో నటించడం లేదు. నేను నటిస్తున్నాను అని వచ్చిన వార్త రూమర్‌ మాత్రమే.

ఒకవేళ నాకు ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. టాలీవుడ్‌ హీరోలందరితో కలిసి నటించేందుకు నేను రెడీగా ఉన్నాను అని అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. మహేశ్‌ బాబు ‘మహర్షి’, నాగార్జున ‘నా సామిరంగ’లో కూడా అల్లరి నరేష్ కీ రోల్స్‌ ప్లే చేసిన సంగతి తెలిసిందే. అన్నట్టు నరేష్ హీరోగా చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా మే 3న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. పెళ్లి ఇతివృత్తంగా రాబోతున్న సినిమా ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు