ఓటిటిలో కూడా అదరగొడుతున్న “నాంది”.!

Published on Mar 15, 2021 8:02 am IST

ఎప్పటి నుంచో ఒక సరైన హిట్ అందుకోవాలని చూస్తున్న పలువురు టాలీవుడ్ హీరోల్లో అల్లరి నరేష్ కూడా ఒకరు. కామెడీ సినిమాలతో మంచి స్టేటస్ తెచ్చుకున్నా నటుడిగా తనకంటూ తృప్తిని ఇచ్చిన చిత్రం మాత్రం “నాంది” అనే చెప్పాలి. ఈ ఏడాదే రెండు సినిమాలతో అల్లరి నరేష్ వచ్చాడు. మొదటగా “బంగారు బుల్లోడు” అంతగా ఆకట్టుకోకపోయినా మళ్ళీ నెలలోపే ఎన్నో అంచనాలు పెట్టుకున్న “నాంది”తో వచ్చాడు.

విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా నరేష్ కు కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం ఒక్క సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా ఓటిటిలో కూడా అదరగొడుతుందని తెలుస్తుంది.

ఈ చిత్రం తాలూకా ఓటిటి హక్కులు దక్కించుకున్న “ఆహా” లో ఇప్పటి వరకు 100 మిలియన్ నిమిషాల వ్యూవర్ షిప్స్ ను నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది కూడా ఒక రికార్డే అని చెప్పాలి. ఎందుకంటే మాస్ మహారాజ్ నటించిన “క్రాక్” కు కూడా అందులో దాదాపు ఈ స్థాయి రెస్పాన్స్ నే వచ్చింది. మొత్తానికి మాత్రం అల్లరి నరేష్ కు ఈ నాంది మరో “నాంధి” గా నిలిచింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :