కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా ఇషా హీరోయిన్ గా మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటి వారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమయింది. కొవ్వూరు, దొమ్మేరు పరిసర గ్రామాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం దోసకాయలపల్లిలో జరుగుతోంది. అక్కడే వారం రోజుల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ షూటింగ్ లో ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
అల్లరి నరేష్ సినిమాలకు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న సినిమా ఎలా ఉంటుందో అని సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇ.వి.వి.సినిమా పతాకంపై అల్లరి నరేష్ సోదరుడు ఆర్యన్ రాజేష్ నిర్మిస్తున్నారు. హట్రిక్ మ్యూజికల్ హిట్స్ తర్వాత కళ్యాణి కోడూరి మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


