స్పీడ్ పెంచిన అల్లరి నరేష్

స్పీడ్ పెంచిన అల్లరి నరేష్

Published on Mar 2, 2020 11:19 PM IST

అల్లరి నరేష్ ప్రయోగాత్మకంగా చేస్తున్న కొత్త చిత్రం ‘నాంది’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 27న మొదలైంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగియగా రెండవ షెడ్యూల్ ఈరోజే మొదలైంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్స్ సినిమాపై విపరీతమైన ఆసక్తిని పెంచాయి. ఎక్కువగా కామెడీ జానర్లో సినిమాలు చేసే నరేష్ అప్పుడప్పుడు ఇలాంటి ఇంటెన్స్ చిత్రాలను కూడా టచ్ చేస్తుంటారు.

గతంలో కూడా ‘నేను, విశాఖ ఎక్స్ ప్రెస్, గమ్యం, శంభో శివ శంభో’ లాంటి చిత్రాలతో మెప్పించిన నరేష్ లాంగ్ గ్యాప్ తర్వాత అలాంటి కథతో చేస్తున్న సినిమానే ఈ ‘నాంది’. ఇందులో క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా సామాజిక అంశాలు కూడా ఉండనున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుతున్న టీమ్ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సతీష్ వెగేశ్న నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు