‘ఆహా’ కోసం మరో యంగ్ డైరెక్టర్ కూడా.. !

Published on Jul 13, 2020 10:10 am IST

ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినప్పటి నుండి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ యువ చిత్రనిర్మాతలతో పాటు డైరెక్టర్స్ తో సహా ‘ఆహా’ కోసం ఒరిజినల్ షోలు మరియు చిన్న చిత్రాలను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు. కాగా తాజాగా అల్లు అరవింద్, విరాటపర్వం దర్శకుడు వేణు ఉడుగులతో కలిసి పనిచేయనున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వేణు ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకత్వం వహించట్లేదు. కేవలం నిర్మాణ బాధ్యతలు మాత్రమే నిర్వహిస్తాడు.

ఇక భవిష్యత్ మొత్తం డిజిటల్ మీడియాదే అని అందరూ నమ్ముతున్నారు. ఓ వైపు థియేటర్స్ కి ఆదరణ తగ్గిపోతుండగా ఓటిటి ప్లాట్ ఫామ్స్ పై నటీనటులు కూడా తమ ద్రుష్టి మళ్లిస్తున్నారు. అందుకే మెగా ప్రొడ్యూసర్ ఆహా అనే ఓ డిజిటల్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ను తెలుగు వారికి మరింత చేరువ చేయడానికి అల్లు అరవింద్ షోలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను కూడా ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More