ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ ఎంత స్థాయిలో అభివృద్ధి చెందిందో మనం చూస్తూనే ఉన్నాము. అనేక భాషల్లో చాలానే స్ట్రీమింగ్ యాప్స్ ఇపుడు అందుబాటులోకి ఉన్నాయి. అయితే మన తెలుగు ఆడియెన్స్ కోసం పూర్తిగా తెలుగు వెబ్ కంటెంట్ తో ప్రారంభించిన మొట్ట మొదటి స్ట్రీమింగ్ యాప్ ఏదన్నా ఉంది అంటే అది “ఆహా” అనే చెప్పాలి. మన తెలుగులో టాప్ మోస్ట్ నిర్మాత అయినటువంటి అల్లు అరవింద్ నేతృత్వంలో ఆరంభించబడిన ఈ యాప్ ఏడాది పూర్తి చేసుకోడంతో అల్లు అరవింద్ తమ వీక్షకుల కోసం ఒక స్పెషల్ లెటర్ నే రాసారు.
ఆహా అనేది పెద్ద కుటుంబం అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాని అందుకే తమ వీక్షకులను తమ కుటుంబంగానే భావిస్తున్నాని వినోదం అంటే మనకు ఇష్టం, తెలుగు అంటే ఇంకా ఇష్టం అందుకే రెండు కలగలిపిన ఆహా ను ఆదరించడం వలనే తమకు కృతజ్ఞ్యులం అని తెలిపారు. అలాగే జూపల్లి రామేశ్వర్ గారికి, రాము గారికి మరియు ఆహా యాప్ కోసం పని చేస్తున్న సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాని అల్లు అరవింద్ ఆ లేఖ ద్వారా తెలిపారు.
A day ahead of our birthday, our promoter #AlluArvind garu wanted to THANK YOU each and every one of you personally!
And he sat down to write this ❤️
After all, 'Meere aha, Meede aha'.#ahaTurns1 pic.twitter.com/9AGO5dzVkm— ahavideoin (@ahavideoIN) February 9, 2021
