సుకుమార్ సినిమాలో బన్నీ ఫుల్ మాస్ ?

సుకుమార్ సినిమాలో బన్నీ ఫుల్ మాస్ ?

Published on Nov 23, 2019 2:00 AM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా రివెంజ్ ఫార్ములాతో తెరకెక్కబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ చిత్రాలను కూడా సుకుమార్ రివెంజ్ ఫార్ములాతోనే తీశారు. అలాగే ఈ సినిమాని కూడా అలాంటి జోనర్ లోనే తియనున్నాడని ఆ వార్తల సారాంశం. అయితే రివెంజ్ ఫార్ములా కంటే కూడా ఎమోషనల్ సాగే యాక్షనే ఎక్కువ ఉంటుందని.. అలాగే బన్నీ పాత్ర కూడా ఫుల్ మాస్ యాంగిల్ లో వైవిధ్యంగా ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఈ కథ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ తో పాటు మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కూడా ఉందట. ఆ క్యారెక్టర్ లో ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ను తీసుకోనున్నారు. ఇక ‘రంగస్థలం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు