ఫోటో మూమెంట్ : అభిమాన నటుడితో సూపర్ స్టార్!

ఫోటో మూమెంట్ : అభిమాన నటుడితో సూపర్ స్టార్!

Published on Jul 23, 2015 2:17 PM IST

mahesh-kamal

సూపర్ స్టార్ మహేష్ బాబు, నట దిగ్గజం కమల్ హాసన్ వీరిద్దరి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఎవరికి వారే నటనలో తమదైన ఒక ముద్రను వేసుకుంటూ దూసుకుపోతున్నవారే! ఇక కమల్ హాసన్ అయితే తన అద్భుతమైన నటనతో దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న వారు. ఆ దిగ్గజ నటుడికి మన సూపర్ స్టార్ సైతం అభిమానే!

ఈ మధ్యే జరిగిన శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్‌లో సైతం మహేష్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కమల్‌కు తాను పెద్ద అభిమానినని మహేష్ చెప్పుకొచ్చిన రోజుకు సరిగ్గా ఐదు రోజులైందనగానే అభిమాన నటుడితో కలిసి మహేష్ కాసేపు ఇలా ముచ్చటించారు. మిర్చి మ్యూజిక్ సౌత్ అవార్డ్స్ సందర్భంగా మహేష్, కమల్ హాసన్‌లు ఇలా కలిసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వీరిద్దరినీ ఇలా ఓ ఫోటోలో చూడడం నిజంగా అందంగా ఉంది కదూ! ఇద్దరి మధ్యనా స్టార్‌గా వెలిగిపోతున్న ఫోకస్ లైట్ స్పెషల్ అట్రాక్షన్!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు