రామ్ చరణ్ కి తన స్టైల్ లో బన్నీ బర్త్ డే విషెస్!

రామ్ చరణ్ కి తన స్టైల్ లో బన్నీ బర్త్ డే విషెస్!

Published on Mar 27, 2024 11:32 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా చేశారు. తనదైన స్టైల్ లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కి బెస్ట్ బర్త్ డే విషెస్ తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ లో సూపర్ స్టైలిష్ ఫోటో ను షేర్ చేస్తూ, హ్యాపీ బర్త్ డే అంటూ చెప్పుకొచ్చారు.

ఈ ఫోటో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ గా ఆకట్టుకుంటున్నారు. రామ్ చరణ్ తన మెస్మరైజింగ్ స్మైల్ తో అందం గా కనిపిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ కి ఇది బెస్ట్ ట్రీట్ అని చెప్పాలి. ఈ ఫోటో సోషల్ మీడియాలో కొద్ది సేపటికే వైరల్ గా మారుతోంది. అల్లు అర్జున్ తదుపరి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule) లో కనిపించనున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంతో పాటుగా, RC16, RC17 లను ప్రకటించి ఫ్యాన్స్ కి బెస్ట్ ట్రీట్ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు