వరుణ్ తేజ్ కి బన్నీ క్యూట్ బర్త్ డే విషెస్!

వరుణ్ తేజ్ కి బన్నీ క్యూట్ బర్త్ డే విషెస్!

Published on Jan 19, 2024 11:52 AM IST

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టిన రోజు నేడు. వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక గా బర్త్ డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్ డే టు మై స్వీటెస్ట్ కజిన్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక బన్నీ ఒక ఫోటో ను కూడా పోస్ట్ కి జత చేశారు. ఈ ఫోటో లో అల్లు అర్జున్, వరుణ్ తేజ్ లు సూపర్ స్టైలిష్ గా ఫోజులిచ్చారు. ఈ ఫోటో ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ ఆపరేషన్ వాలెంటైన్ లో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 16, 2024న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి పుష్ప 2 ది రూల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 15, 2024 న థియేటర్ల లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు