స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. దర్శక హీరోల మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. మెగా కాంపౌండ్ వర్గాలు బన్ని – బోయపాటిల సినిమాను కన్ఫర్మ్ చేశారు.
అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఎస్.ఎస్.తమన్ సంగీత దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత బోయపాటి సినిమా షూటింగులో పాల్గొంటారు. ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే సినిమా ఇదేనని సమాచారం. త్వరలో మిగతా వివరాలు వెల్లడించనున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా నటిస్తున్న సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వేసవి ప్రధమార్ధంలో ఈ సినిమా విడుదల కానుంది.
