‘పుష్ప – 3’ మూవీ పై అల్లు అర్జున్ క్లారిటీ

‘పుష్ప – 3’ మూవీ పై అల్లు అర్జున్ క్లారిటీ

Published on Feb 16, 2024 11:33 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, తాజాగా బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన అల్లు అర్జున్ మాట్లాడుతూ, పుష్ప 1 మూవీని ప్రత్యేకంగా ఆ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తుండడంతో దానిని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నట్లు అన్నారు.

అలానే పుష్ప 3 గురించి మాట్లాడుతూ, ఆ మూవీ కచ్చితంగా ఉండొచ్చని అన్నారు. దానికి సంబంధించి మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఇక పుష్ప ని ఫ్రాంచైజ్ లుగా మార్చాలని అంటుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు. దీనితో పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు