కళ్యాణ మండపానికి విరాళం ప్రకటించిన బన్నీ !

Published on Jan 17, 2019 1:00 am IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతిని తన ఫ్యామిలీ మెంబర్స్ తో తన తాతగారు అల్లు రామలింగయ్యగారి సొంతూరు పాలకొల్లులో జరుపుకున్నారు. బన్ని సంక్రాంతి సంబరాలకు సంబందించిన ఫోటోలు కూడా నిన్నటి నుండి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

కాగా పాలకొల్లులో నిర్మించబోతున్న ఓ కళ్యాణ మండపానికి బన్ని పది లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇక బన్ని ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత వీరిద్దరూ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా ఇది. కాగా ఈ సినిమా మార్చి నుండి షూట్ కి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :