తన 18ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై బన్నీ ఎమోషనల్ పోస్ట్.!

Published on Mar 28, 2021 10:58 am IST

మన టాలీవుడ్ లో స్టైల్ అండ్ సరికొత్త ట్రెండ్ డ్రెస్సింగ్ కు కేరాఫ్ అడ్రెస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి హీరోగా స్టార్ట్ అయినా తన కష్టం తన స్వేదంతో పాన్ ఇండియన్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు నిలబడ్డాడు. సరిగ్గా 18 ఏళ్ల కితం ఇదే మార్చ్ 28న దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తో చేసిన “గంగోత్రి” విడుదలయింది. అక్కడ నుంచి అంచెలంచులుగా ఎదిగి అపారమైన అభిమానాన్ని బన్నీ సొంతం చేసుకున్నాడు.

మరి ఈ సందర్భంగా బన్నీ ఓ ఎమోషనల్ పోస్ట్ ను పెట్టాడు. “నా మొదటి సినిమా వచ్చి 18 ఏళ్ళు అయ్యింది. మరి ఈ 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మొదటి నుంచి తనకు అండగా నిలబడ్డ ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞ్యతలు చెప్పాలనుకుంటున్నాను, నా గుండె నిండా వారందరి పట్ల కృతజ్ఞ్యత ఉందని, ఇన్నేళ్ళుగా అందరూ నాపై కురిపించిన ప్రేమకు రుణపడి ఉన్నానని” కృతజ్ఞ్యతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం బన్నీ మరియు సుకుమార్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం “పుష్ప” పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :