అల్లుఅర్జున్ ఖరీదైన వ్యాన్ కొనడానికి కారణం ఎవరంటే…!

అల్లుఅర్జున్ ఖరీదైన వ్యాన్ కొనడానికి కారణం ఎవరంటే…!

Published on Jul 5, 2019 12:32 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఉపయోగిస్తున్నఓ ఖరీదైన క్యారవాన్ పై గతంలోనే వార్తలు రావడం జరిగింది. అల్లుఅర్జున్ నేమ్ లోగోతో నలుపు రంగులో ఉన్న ఆ భారీ వాహనం చూస్తుంటేనే అది చాలా విలువైనదని అర్థం అవుతుంది. ఏడు కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన అలాంటి ఖరీదైన క్యారవాన్ ఇండియా లోనే ఏ స్టార్ హీరో కూడా ఉపయోగించడం లేదంట. దీనితో అల్లు అర్జున్ క్యారవాన్ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ ఐయ్యింది.

ఐతే ఈ ఖరీదైన వానిటీ వ్యాన్ గురించి అల్లు అర్జున్ మొదటిసారిగా స్పందించారు. “జీవితంలో నేను కొనే ప్రతి విలువైన వస్తువు కొన్న ప్రతిసారి నాకు గుర్తొచ్చే విషయం, మీరు నాపై చూపిన అభిమానం ప్రేమవలనే వాటిని నేను పొందగలుగుతున్నాను, అందుకు మీకు నా కృతఙ్ఞతలు, ఇది నా వానిటీ వ్యాన్ , ఫాల్కన్” అని ట్వీట్ చేశారు. అలాగే ఆ వానిటీ వ్యాన్ కి సంబందించిన కొన్ని ఇంటీరియర్ ఫోటోలు కూడా పంచుకున్నాడు. ప్రస్తుతం అల్లుఅర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతుండగా, వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు