ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “రాకా”. దర్శకుడు అట్లీతో చేస్తున్న ఈ మాసివ్ ప్రాజెక్ట్ షూట్ కి చిన్న గ్యాప్ ఇచ్చి బన్నీ లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. దాదాపు 2000 మంది తన అభిమానులతో మీటప్ అయ్యిన బన్నీ ఇందులో చాలానే విషయాలు షేర్ చేసుకున్నారు.
ఇలా మంచి సందర్భం వచ్చింది కాబట్టి తన అభిమానులకి అనే కాదు ట్రోల్స్ చేసే వారికీ, హేట్ చేసేవారికి కూడా ఒకటే స్టేట్మెంట్ ని అందించడం వైరల్ గా మారింది. మీకు ఒకటి నచ్చలేదు అంటే అసలు ఆ విషయాన్ని పట్టించుకోవడం మానెయ్యండి అని మీకు నచ్చని విషయంపై ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారని ఐకాన్ స్టార్ హితవు పలికారు.
అంతే కాకుండా దీనికి మంచి ఉదాహరణ కూడా అందించడం జరిగింది. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే అవి నీకు నచ్చని వాటి మీద ఖర్చు పెట్టవు కదా ఇది కూడా అలానే నీకో విషయం నచ్చనపుడు సమయం వృధా చేసుకోకుండా నీకు నచ్చిన మరో పని చేసుకోమని చెప్పడం ఈ మీట్ లోనే ఒక హైలైట్ స్టేట్మెంట్ గా నిలిచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


