తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ త్వరలోనే తెలుగులో సినిమా చేస్తానని ప్రకటించి ఇప్పుడు అధికారికంగా తన తర్వాతి సినిమా ఒక తెలుగు స్టార్ హీరోతో చేయబోతున్నానని, చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ హీరో ఎవరనేది ప్రకటిస్తానని అధికారికంగా తెలిపారు. దీంతో అందరిలోనూ ఇంతకీ ఎవరా హీరో అనే ఆలోచన మొదలైంది.
ఉన్న స్టార్ హీరోల్లో పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండగా మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వాళ్లంతా వరుసగా రెండు మూడు కమిట్మెంట్స్ ఇచ్చేసి ఉన్నారు. ఇక మిగిలింది అల్లు అర్జున్ ఒక్కరే. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘నా పేరు సూర్య’ ముగింపు దశలో ఉంది. అది కాకుండా ఆయన కొత్త సినిమాలేవీ ప్రకటించలేదు. దీంతో అట్లీ డైరెక్ట్ చేయబోయే ఆ స్టార్ హీరో అల్లు అర్జునే అని ఫిల్మ్ నగర్లో బలమైన టాక్. మరి వార్త నిజమో కాదో తెలుసుకోవాలంటే 123 తెలుగును ఫాలో అవ్వండి.


