బన్నీ, కొరటాల సినిమా ఎప్పుడంటే…

Published on Apr 14, 2021 1:55 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుని పెట్టుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న ‘పుష్ప’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా మీద భారీ అంచనాలున్నాయి. కొన్ని రోజుల క్రితం విడుదలైన ‘టీజర్’ విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ ఫస్ట్ టైమ్ చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇదే కాదు తర్వాతి సినిమాలను కూడ అదే స్థాయిలో చేయాలనేది బన్నీ ప్లాన్. ‘పుష్ప’ పూర్తికాగానే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ ప్రాజెక్ట్ చేయనున్నారు. దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.

ఇది కంప్లీట్ కాగానే కొరటాల శివతో బన్నీ సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ నిర్మించనుంది. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. కొరటాల ‘ఆచార్య’ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా పూర్తవడానికి చాలా సమయమే పడుతుంది. ఈలోపు బన్నీ ‘ఐకాన్’ కూడ ముగుస్తుంది. అలా ఇద్దరూ 2022 ఆరంభానికి ఫ్రీ అవుతారు. కనుక వీరి సినిమా 2022 ఏప్రిల్ సమయానికి మొదలుకావొచ్చు. దీన్ని కూడ పాన్ ఇండియా లెవల్లోనే తెరకెక్కిస్తారు.

సంబంధిత సమాచారం :