బన్నీ సినిమా మహేశ్ కథతోనేనా ?

బన్నీ సినిమా మహేశ్ కథతోనేనా ?

Published on Jun 3, 2019 10:00 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తన తరువాత సినిమాని మహేశ్ తో చెయ్యాలనుకొని అల్లు అర్జున్ తో చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే సుకుమార్ మహేష్ కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథను కూడా రాశాడు, మహేష్ కు వినిపించాడు కూడా. కానీ మహేష్ కి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సినిమాకంటే మంచి ఎంటర్ టైనర్ చేస్తే బాగుంటుందని అనిల్ రావిపూడి సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

కాగా సుకుమార్ ఆ స్మగ్లింగ్ నేపథ్యంలో కథను అల్లు అర్జున్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి.. బన్నీకి వినిపించి.. మొత్తానికి సినిమాను ఒకే చేసుకున్నాడు. ఏది ఏమైన మహేష్ బాబుకి నచ్చని కథ, బన్నీకి నచ్చింది. ఇక రంగస్థలం సినిమాతో సూపర్ హిట్ కొట్టి టాప్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సుకుమార్, రంగస్థలం లాగే ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు