
అల్లు అర్జున్ కెరీర్లో రేసు గుర్రం భారీ విజయం సాధించిన చిత్రమైనా తన కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచేది మాత్రం ఆర్య అనే తెలిపాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేటికి 10ఏళ్ళు గడిచాయి. ఫీల్ మై లవ్ అంటూ సాగే ఈ చిత్ర నేపధ్యంలో టైటిల్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ లవ్ సినిమాల ట్రెండ్ ని సెట్ చేసాడు
గంగోత్రితో తెరకు పరిచయమైన తరువాత కూల్ లుక్ తో ఆర్య సినిమాలో నటించి వెంటనే బిగ్ లీగ్ లోకి ప్రవేశించాడు. 2004లో ఈ సినిమాలో అతని నటన, డ్యాన్స్ లకు అశేష అభిమానాన్ని అందుకున్నాడు. ఒరిస్సా, మహారాష్ట్రలలో సైతం అతనికి ఫ్యాన్స్ వుండడానికి ఈ సినిమానే కారణం. అప్పట్లో విడుదలైన ఆ అంటే అమలాపురం పాట ఇప్పటికీ చాలామందికి ఫేవరేట్ సాంగ్
ఇన్ని మధురానుభూతుల మధ్య ఆర్య తనకి బెస్ట్ సినిమాగా ఎప్పటికీ వుంటుందని అల్లు అర్జున్ తెలిపాడు. త్వరలో త్రివిక్రమ్, సమంతల కలయికలో రానున్న సినిమాలో హీరోగా దుమ్ముదులపడానికి సిద్ధపడుతున్నాడు

