“పుష్ప”తో మాసివ్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ సెట్ చేసిన బన్నీ.!

Published on Apr 10, 2021 8:01 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” నుంచి మేకర్స్ ఇటీవలే బన్నీ బర్త్ డే సందర్భంగా మాస్ పుష్ప రాజ్ టీజర్ కట్ ను రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం తాలూకా టీజర్ విడుదల అయ్యిన నాటి నుంచి భారీ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది.

జెనరల్ గానే బన్నీ వీడియోస్ కు సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. మరి దీనికి అంతకు మించే రెస్పాన్స్ రావడంతో పలు రికార్డులు బద్దలయ్యాయి. వాటితో పాటుగా ఇప్పుడు బన్నీ ఓ ఫాస్టెస్ట్ అండ్ సెన్సేషనల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈ టీజర్ తో బన్నీ మన తెలుగులోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ రికార్డును సెట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు.

జస్ట్ 59 గంటల 10 నిమిషాల్లో బన్నీ ఈ మాసివ్ ఫీట్ సెట్ చేసినట్టుగా బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి మాత్రం పుష్ప వేట ఇక్కడ నుంచే మొదలయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అవుట్ స్టాండింగ్ సంగీతం అందిస్తుండగా దేశంలోనే పేరొందిన పలువురు టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :