బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేసిన అల్లు అర్జున్!

బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేసిన అల్లు అర్జున్!

Published on Feb 14, 2024 9:02 PM IST

వాలెంటైన్స్ డే రోజున తమ భాగస్వామితో ప్రతి ఒక్కరూ లవ్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కుటుంబం తో వాలెంటైన్స్ డే ను జరుపుకున్నారు. సోషల్ మీడియా లో తన భార్య అల్లు స్నేహ రెడ్డి మరియు అయాన్, అర్హా లతో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేశారు. కేక్ ను కట్ చేసి వేడుకను జరుపుకున్నారు. ఈ ఫోటో ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఏడాది పుష్ప 2 ది రూల్ చిత్రంతో ఆడియెన్స్ ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రం పుష్ప ది రైజ్ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు