ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి నెక్స్ట్ రానున్న పలు భారీ చిత్రాల్లో ఒకటే ‘రాకా’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ యాక్షన్ అండ్ విజువల్ ట్రీట్ కోసం అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి నెక్స్ట్ ఓ సాలిడ్ అప్డేట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. చాలా ఆలస్యంగా కూడా అప్డేట్స్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ కూడా బాగా విసిగిపోయి ఉన్నారు.
ఇక ఇదిలా ఉండగా ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన బన్నీ ఫ్యాన్స్ కే మతి పోగొట్టాడు. వాళ్లే కాదు నేను కూడా ‘రాకా’ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో ఫ్యాన్స్ కే ఫ్యూజ్ లు ఎగిరిపోయేంత పనైంది. కానీ ఈవెంట్ లో తన స్పీచ్ లో మాత్రం ఫ్యాన్స్ కి కొంచెం క్లారిటీ ఇచ్చాడు.
రాకా అప్డేట్ ని సాధ్యమైనంత తొందరగానే తీసుకొస్తామని. మీరంతా ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసు కానీ ఇచ్చేది ది బెస్ట్ ఇవ్వాలనే కొంచెం ఆలస్యం అవుతుంది, సో కొంచెం ఓపిక పట్టాలని కోరి ఫ్యాన్స్ ని కూల్ చేసాడు. సో కొంచెం ఆగితే రాకా నుంచి బెస్ట్ అప్డేట్ త్వరలో రావచ్చు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


