రుద్రమదేవి టీంతో అల్లు అర్జున్ చర్చలు..

రుద్రమదేవి టీంతో అల్లు అర్జున్ చర్చలు..

Published on Jul 2, 2014 5:21 PM IST

allu-arjun

హీరోగా తను నటించే ప్రతి సినిమాలోనూ 100% పెర్ఫెక్షన్ చూపడానికి ప్రయత్నించే నటులలో అల్లు అర్జున్. ‘రుద్రమదేవి’ సినిమాపై అల్లు అర్జున్ చాలా ప్రత్యెక శ్రద్ధ కనబరుస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారిగా చారిత్రాత్మక పాత్రలో నటిస్తున్న సినిమా ‘రుద్రమదేవి’. గోన గన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చారిత్రాత్మక నేపధ్యం ఉన్న సినిమా కావడంతో ఆ తరహా లుక్ కోసం గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ కసరత్తులు చేస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్ లో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. పాత్రకు తగిన విధంగా గడ్డం మీసం పెంచుతున్నాడు.

త్వరలో ‘రుద్రమదేవి’ తాజా షెడ్యుల్ మొదలుకానుంది. ఈ షెడ్యుల్లో అల్లు అర్జున్ పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అల్లు అర్జున్, తన పాత్ర తెరుతెన్నులు తెలుసుకోవడం కోసం ‘రుద్రమదేవి’ కథా రచయితలతో సమావేశమయ్యారు. ‘రుద్రమదేవి’ టీంతో చర్చిస్తున్నారు. రాబిన్ హుడ్ తరహాలో ‘అల్లు అర్జున్’ పాత్ర ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు