ప్రాణం పోయినా ఐ లవ్ యు సుక్కూ అంటున్న అల్లు అర్జున్

ప్రాణం పోయినా ఐ లవ్ యు సుక్కూ అంటున్న అల్లు అర్జున్

Published on Nov 27, 2019 8:24 PM IST

AlluArjun

అల్లు అర్జున్ కెరీర్లో ‘ఆర్య, ఆర్య-2’ సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘ఆర్య’ సినిమాతోనే బన్నీ యువతకు బాగా దగ్గరైంది. ఒక రకంగా బన్నీకి స్టైలిష్ స్టార్ అనే పేరు వచ్చింది కూడా ఆ సినిమాతోనే. ఇక ‘ఆర్య-2’ చిత్రం ‘ఆర్య’ స్థాయిలో ఆడకపోయినా పెద్ద మ్యూజికల్ హిట్ అయింది. ఇప్పటికీ ఈ సినిమా పాటలు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి.

అందుకే ఈ సినిమాలన్నా, వాటిని తెరకెక్కించిన సుకుమార్ అన్నా బన్నీకి బోలెడంత ఇష్టం. ఈరోజు నవంబర్ 27తో ‘ఆర్య-2’ విడుదలై 10 వసంతాలు పూర్తైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బన్నీ సుకుమార్ కు థ్యాంక్స్ చెబుతూ ‘సుకుమార్ కు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఐ లవ్ యు నా ఊపిరి ఆగిపోయినా.. ఐ లవ్ యు నా ప్రాణం పోయినా’ అంటూ ఏకంగా పాటనే పాడేశారు. ఇకపోతే వీరిద్దరూ కలిసి త్వరలో కొత్త సినిమా ఒకటి చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు