ఆ సినిమాను తప్పక చూడమంటున్న అల్లు అర్జున్

Allu arjun

గత నెల 21న విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుని ఘన విజయాన్ని అందుకుంది. కేవలం ప్రేక్షకులు, విమర్శకులు మాత్రమే కాకుండా సినీ హీరోలు సైతం చిత్రాన్ని అది పనిగా చూసి అభినందిస్తున్నారు. ఇప్పటికే రానా, విజయ్ దేవరకొండ, అడివి శేష్, సందీప్ కిషన్ లాంటి హీరోలు సినిమాపై ప్రశంసలు కురిపించగా తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం చిత్రాన్ని వీక్షించారు.

షో అనంతరం సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మంచి ఫన్ ఉన్నాయని కొత్త దర్శకులు, నటులు పరిశ్రమలోకి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను తప్పకుండా చూడాలని అన్నారు. దర్శకుడు స్వరూప్ రాజ్, హీరో నవీన్ పోలిశెట్టిలను నేరుగా అభినందించారు. బన్నీ లాంటి స్టార్ హీరోలు ఈ రంకంగా చినన్ సినిమాలకు సపోర్ట్ ఇవ్వడం నిజంగా అభినందించదగిన విషయమే.

Exit mobile version