
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ పేజ్ తో ఒక మైలురాయిని దాటి కొత్త రికార్డును సృష్టించాడు. కొన్ని గంటల క్రితమే రాజమౌళి ఫేస్ బుక్ పేజ్ కి 20 లక్షల లైక్ లు వస్తే అల్లు అర్జున్ ఏకంగా 50లక్షల లైక్ లతో దూసుకుపోతున్నాడు. ఒక దక్షిణాది నటుడికి ఇన్ని లైకులు రావడం ఇదే మొదటిసారి
అల్లు అర్జున్ సోషల్ నెట్వర్కింగ్ లో జోరుగా పాల్గుంటాడు. రానున్న రోజుల్లో అల్లు బాబు మరింత పాపులర్ కానున్నాడు. తనకి ఇంత అరుదైన గుర్తింపుని ఇచ్చినందుకు మన బన్నీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఒక థాంక్స్ వీడియో కూడా పంపాడు
రేస్ గుర్రం తరువాత అల్లు అర్జున్ హీరోగా మరొక సినిమాలో నటించలేదు. ఈ బాబు త్వరలో అనుష్క ‘రుద్రమదేవి’లో అతిధిపాత్ర పోషించనున్నాడు

