అల్లు అర్జున్ -త్రివిక్రమ్ మూవీ నెక్స్ట్ షెడ్యూలు డేట్ ఫిక్స్

Published on May 29, 2019 3:53 pm IST

అల్లుఅర్జున్, త్రివిక్రమ్ కంబినేషన్లో మూడవ సినిమా గా తెరకెక్కుతున్న మూవీ నెక్స్ట్ షెడ్యూలు జూన్ 4 న ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఫ్యామిలీ తో వెకేషన్ లో ఉన్న అల్లు అర్జున్ వచ్చిన వెంటనే ఈ షెడ్యూలు మొదలు పెట్టనున్నారు.

ఈ మూవీలో కీలక రోల్ చేస్తున్న సీనియర్ హీరోయిన్ టబు కూడా ఈ షెడ్యూల్ లో జాయిన్ కానున్నారని సమాచారం. దాదాపు 30 రోజులు నిరవధికంగా చిత్రీకరణ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారంట.

ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే మెయిన్ లీడ్ చేస్తుండగా, సెకండ్ హీరోయిన్ గా కేతికా శర్మ చేస్తుంది. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More