రేపటి నుండి త్రివిక్రమ్ – బన్ని సినిమా లేటెస్ట్ షెడ్యూల్

రేపటి నుండి త్రివిక్రమ్ – బన్ని సినిమా లేటెస్ట్ షెడ్యూల్

Published on Jan 5, 2015 11:52 PM IST

Trivikram-alluarjun
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా తాజా షెడ్యూల్ మంగళవారం నుండి ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తవుతుందని సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు హైదరాబాద్ శబ్దాలయా స్టూడియోస్ లో ఇటివలే మొదలయ్యాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన సమంత, అదా శర్మ, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.

నిర్మాణంతర కార్యక్రమాలను జనవరి నెలాఖరు కల్లా పూర్తిచేసి ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ‘జులాయి’ తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ ను నిర్మాత సెట్ చేశారు.

తాజా వార్తలు